నిఫా వైరస్‌ బీజేపీని చంపేస్తుంది

నిఫా వైరస్‌ బీజేపీని చంపేస్తుంది

నిఫా వైరస్ బీజేపీని చంపేస్తుందన్నారు టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి గబ్బిలం నుంచి నిఫా వైరస్ బీజేపీని తాకిందని.. దీని వల్ల బీజేపీ, వైసీపీ, జనసేన కూడా దెబ్బతినడం ఖాయమన్నారు డొక్కా. చంద్రబాబు కృషి వల్లే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల వరద పారుతోందన్నారు. ముఖ్యమంత్రి శ్రమను నీరుగార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బీజేపీ విలువలను తుంగలో తొక్కి రాష్ట్రాల హక్కులను హరిస్తోందని.. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కే కాదు.. దేశానికే అనవసరమన్నారు. కేవలం రాజకీయపబ్బం గడుపుకోవటానికే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వైసీపీ, జనసేనలకు కేంద్రాన్ని నిలదీసే దమ్ము లేదని.. ఈ రెండు పార్టీలకు ఓ విధానం.. పద్ధతి అంటూ ఏం లేవని.. కేవలం చంద్రబాబు, లోకేశ్‌లను వ్యక్తిగతంగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారని డొక్కా ఎద్దేవా చేశారు. ఈ రెండు దగాకోరు పార్టీలని.. వీటి వల్ల ప్రజలకు ఒరిగేదేమి వుండదని వ్యాఖ్యానించారు.