కేంద్ర ప్యాకేజీ వృద్ధీ రేటును పెంచుతుందా?

కేంద్ర ప్యాకేజీ వృద్ధీ రేటును పెంచుతుందా?

 

కరోనా వల్ల ప్రపంచంలోని ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు...అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే కుదేలైపోయాయి,లాక్‌డౌన్ ఇంకా ఇలాగే కొనసాగితే అది మరింత దిగజారిపోతాయాని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు....కరోనా లాక్‌డౌన్‌తో భారత జీడీపీ కూడా అదే పరిస్ధితి ఎదుర్కొంటున్నది... ఆర్ధిక నిపుణులు అంచనా వేసిన దానికంటే ఘోరంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మార్చి,ఏప్రిల్ మాసలలో భారత్‌లో పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేశారు...దాంతో భారత సేవల రంగం వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోయింది... భారత జీడీపీలో అత్యధిక వాటా 60 శాతంపైగా సేవల రంగానిదే... కనుక మొత్తం జీడీపీ వృద్ధి పైన తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది అంచనా...కరోనా వ్యాప్తి వలన ప్రజల డిమాండ్ శక్తి  బాగా పడిపోయిందని దానితో మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు సైతం ఉత్పత్తిలో తీవ్ర కోత పెట్టుకోవాల్సి వచ్చింది...
భారత దేశంలో సేవల రంగం పనితీరును ట్రాక్ చేసే అనేక సంస్ధలు మార్చి,ఏప్రిల్‌,మే నెలలో ఉత్పత్తి కోల్పోయాని తెలిపాయి.. అంతే కాదు, ఒకే త్రైమాసికంలో  ఇంత భారీ స్ధాయిలో సూచికలు పడిపోవడం 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం తర్వాత ఇదే మొదటిసారి... కరోనా లాక్‌డౌన్‌ వలన వినియోగదారులు తమ విచక్షణ ఖర్చులు తగ్గించేశారని, లాక్‌డౌన్ వల్ల ఆర్ధిక సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు,రెంటింగ్, వ్యాపార కార్యకలాపాలు మొదలైన రంగాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని మార్కెట్ విశ్లేషకులు తెలుపుతున్నారు..

భారత ఆర్ధిక వ్యవస్ధ వచ్చే రోజుల్లో భారీ  వృద్ధిని సాధిస్తుందని అనేక సభలో మన పాలకులు ప్రకటించారు, బడ్జెట్లో కూడా వృద్దిపై అనేక ఆశాజనక ప్రకటనలు చేశారు..కాని ఇప్పుడు కరోనా మహమ్మారి ఫలితంగా భారత  వృద్ధి రేటు అందులో సగానికి 1%  పడిపోతుందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు...ప్రస్తుత దేశంలో కరోనా వ్యాప్తిని చూస్తే, వృద్ది రేటు వ్యతిరేకంగా మైనస్‌లో నమోదైన అశ్చర్యం చెందాల్సిన అవసరం లేని నిపుణులు అంచనా వేస్తున్నారు...
కొత్త వ్యాపారాలు పెట్టడానికి  ఎవరు ముందుకు రావడం లేదని, ప్రజల్లో వినియోగం శాతం పడిపోనున్నదని  సర్వేలో తేలింది... నూతన వ్యాపారాల సూచిక నెగిటివ్ వృద్ధికి పడిపోవటం, ఒకటిన్నర సంవత్సరాల తర్వాత  ఇదే మొదటిసారి కాగా ఇంత భారీగా పడిపోవడం ఎనిమిది ఏళ్ళ తర్వాత ఇదే మొదటిసారి... అలాగే మాన్యుఫాక్చరింగ్ మరియు సేవల రంగాల ఉమ్మడి రంగాలు పూర్తిగా పడిపోనున్నదని మార్కెట్ సర్వేలో తేలింది... అనగా సేవల రంగంతో పాటు ఫ్యాక్టరీ ఉత్పత్తి కూడా వృద్ధి చెందటానికి బదులు కుచించుకుపోనున్నది...

దేశంలో కరోనా కారణంగా డబ్బు సరఫరా పూర్తిగా తగ్గిపోయినందున,అనివార్యంగా ప్రజల్లో డిమాండ్ తగ్గిపోతుంది...దాంతో ఆ వెంటనే ధరలు తగ్గుతున్నాయి కాని...ఇప్పుడు కేంద్రం ప్రకటిస్తున్న అనేక ఉద్దీపన ప్యాకేజీలు కూడా బడా కంపెనీలకు, పెద్ద బాబులకు మరిన్ని నిధులు సమకూరడం వరకు జరుగుతుంది కానీ జనానికి ఉపాధి కల్పించే వరకు దాని ప్రయాణం సాగదని మార్కెట్  నిపుణులు విశ్లేషిస్తున్నారు...

కేంద్రం ప్రకటిస్తున్న ప్యాకేజీల ద్వారా కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారాలు మరిన్ని రుణాలు తీసుకుని ఉత్పత్తి కార్యకలాపాలకు వినియోగించాలని సూచిస్తుంది... ఇది అంతిమంగా జనానికి ఉపాధి పెరుగుదలగా ఫలితం ఇస్తుందని చెపుతుంది...ఇది జరుగుతుందా లేదా అన్నది గమనించాల్సిన విషయం... కానీ చరిత్ర నిరూపించిన సత్యం ఏమిటంటే వడ్డీ రేటు తగ్గుదల వల్ల బడా కంపెనీలకు, పెద్ద బాబులకు మరిన్ని నిధులు సమకూరడం వరకు జరుగుతుంది కానీ జనానికి ఉపాధి కల్పించే వరకు దాని ప్రయాణం సాగదు.. అలా సమకూరిన అదనపు నిధులను ఇతర కార్యకలాపాలకు తగలేయడం తప్ప నిజంగా ఉత్పత్తి కార్యకలాపాలలోకి దిగి ఉపాధి కల్పనకు దారి వేయడం జరగలేదు..