హెల్మెట్ ధరించి డాక్టర్ల వినూత్న నిరసన

హెల్మెట్ ధరించి డాక్టర్ల వినూత్న నిరసన

ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్లు తలకు హెల్మెట్‌లు ధరించి వినూత్న నిరసనకు దిగారు. తరచూ పెచ్చులూడుతూ భయపెడుతున్న ఆస్పత్రి భవనంలో పని చేయలేకపోతున్నామంటూ డాక్టర్లు వాపోతున్నారు. దీనిలో భాగంగా హెల్మెట్లు ధరించి పేషంట్స్ కు వైద్యం అందించారు. ప్రభుత్వం చర్యలు ప్రారంభించేవరకు తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. 

గత నెల రోజుల్లో ఐదు సార్లు పెచ్చులూడి పడ్డాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వైద్యం అందిస్తున్నామని జుడాలు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త భవనం నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెప్పి ఏడాది గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.