టీకా అందుబాటులోకి వచ్చినా... పరిస్థితి ఇలానే ఉంటుందా? 

టీకా అందుబాటులోకి వచ్చినా... పరిస్థితి ఇలానే ఉంటుందా? 

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే.  కరోనా తీవ్రత పెరిగిపోతున్నది.  కరోనా నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి.  ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, కరోనా నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు.  టీకా కోసం అన్ని దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా పేరు తెచ్చుకున్న అమెరికా కూడా కరోనాపై పోరాటం చేస్తూనే ఉన్నది.  ఈ పోరాటం నుంచి బయటపడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి లేదా జనవరిలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ పౌసీ పేర్కొన్నారు.  డిసెంబర్ లేదా జనవరిలో అందుబాటులోకి వచ్చే టీకా ఎంతవరకు పనిచేస్తుందో చెప్పలేమని అన్నారు.  మోడెర్నా, ఫైజర్ కంపెనీ టీకాలు జనవరి నాటికి అందుబాటులోకి వస్తాయని, టీకా వచ్చినా కూడా 2021చివరి నాటికి పరిస్థితి ఇలా ఉండొచ్చని, పెద్దగా మార్పులు ఉండబోవని డాక్టర్ పౌసీ తెలిపారు.