శ్రీరాముడు ఏ తేదీన జన్మించాడో తెలుసా?

శ్రీరాముడు ఏ తేదీన జన్మించాడో తెలుసా?

అయోధ్య కేసు తరువాత దేశంలో అయోధ్య చుట్టూ ఉన్న చరిత్ర గురించి తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి విషయాల కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.  శ్రీరాముడు అయోధ్యలోని పుట్టాడు అని సుప్రీం కోర్టు చెప్పడంతో.. అయోధ్యకు మరింత ప్రాధాన్యత వచ్చింది.  అయోధ్యలో జన్మించాడని పురాణాలు చెప్తున్నా.. ఇప్పటి తరం మనుషులకు సాంకేతిక నిరూపణ ఉంటేనే గాని నమ్మరు.  

సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రాముడి వివరాల కోసం సెర్చ్ చేస్తున్నారు.  శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5,114, జనవరి 10 అర్ధరాత్రి 12:45 గంటలకు జన్మించినట్టు ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆన్ వేదాస్ నిర్ధారించింది. శ్రీరాముడు జన్మించినపుడు ఐదు గ్రహాలు ఉఛ్చ దశలో ఉన్నాయని, అలానే రాముడు వనవాసానికి వెళ్ళినపుడు రాముడి వయసు 25 సంవత్సరాలని ఐ సర్వ్ పేర్కొంది.  దీనికోసం ఆ సంస్థ ప్లానిటోరియం అనే ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను తయారు చేసింది.  ఈ సాఫ్ట్ వేర్ ఆధారంగా ఖచ్చితమైన వివరాలను నిర్ధారించింది.