ఒక్కో కరోనా రోగిపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? 

ఒక్కో కరోనా రోగిపై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? 

కరోనా వైరస్ సోకిన రోగులకు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చికిత్స అందిస్తున్నారు.  దీనికి చాలా కారణాలు ఉన్నాయి.  కరోనా అన్నది కొత్త వైరస్.  ఈ వైరస్ ప్రస్తుతం ఎలాంటి ప్రభావం చూపిస్తున్నదో అందరికి తెలిసిందే.  వైరస్ వలన ప్రపంచం మొత్తం మీద దాదాపుగా 3.88 లక్షల మంది మరణించారు.  

రోజు రోజుకు కేసుల సంఖ్యతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.  ఒక్క కరోనా రోగికి చికిత్స అందించాలి అంటే దానికి అయ్యే ఖర్చు భారీగా ఉంటుంది. కరోనా సోకిన రోగిని స్పెషల్ ఐసోలేషన్ వార్డులో ఉంచాలి.  దానికి అయ్యే ఖర్చు భారీగా ఉంటుంది.  ఒకవేళ వెంటిలేటర్ అవసరమైతే దానికి అయ్యే ఖర్చు మరింత ఉంటుంది.  ఇక ఏ రోజుకు ఆరోజు పీపీఈ కిట్లు ఇవ్వాలి.  శానిటేషన్ చేయాలి.  వీటితో పాటుగా ప్రతిరోజూ పౌష్టికాహారం అందించాలి.  వీటన్నింటికి చాలా ఖర్చు అవుతుంది. ఒక కరోనా రోగికి కనీసం రూ.3.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని అవుతుందట.  ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే ఈ స్థాయిలో ఖర్చు అవుతుంటే, కరోనా చికిత్సను ప్రైవేట్ హాస్పిటల్స్ అనుమతి ఇస్తే ఏ స్థాయిలో వసూళ్లు చేస్తారో చెప్పక్కర్లేదు.  అందుకే ప్రభుత్వం కరోనా వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయడం లేదు.