పుత్తడి ఈ వారంలో ఎంత తగ్గిందో తెలుసా?

పుత్తడి ఈ వారంలో ఎంత తగ్గిందో తెలుసా?

బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.  లాక్ డౌన్ సమయంలో ఒక్కసారిగా పెరిగిన ధరలు, ఆ తరువాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం, దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో వాటి ప్రభావం బంగారం ధరలపై పడింది.  గడిచిన వారం రోజులో బంగారం ధరలు ఎంత తగ్గాయో ఇప్పుడు చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 తగ్గింది.  ప్రస్తుతం 22 క్యారెట్ల ధర రూ.46,900 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.790 తగ్గింది.  24 క్యారెట్లు బంగారం ధర ప్రస్తుతం రూ.51,240గా ఉంది.  ఇక వెండి గత వారం రోజుల్లో వెండి ధర రూ.1900 వరకు తగ్గింది.  దీంతో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.66,500గా ఉంది.