తెలంగాణ సచివాలయంలోని జీ బ్లాక్ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలుసా? 

తెలంగాణ సచివాలయంలోని జీ బ్లాక్ నిర్మాణం ఎప్పుడు జరిగిందో తెలుసా? 

హైదరాబాద్ లోని తెలంగాణ పాత సచివాలయంను ప్రభుత్వం కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.  సంవత్సరం క్రితం భూమి పూజ నిర్వహించిన తరువాత సచివాలయాన్ని కూల్చివేస్తున్నారు.  అయితే, తెలంగాణ లోని ఈ సచివాలయానికి చాలా పెద్ద చరిత్ర ఉన్నది.  ఇందులో మొత్తం 10 బ్లాకుల నిర్మాణాలు ఉన్నాయి.  అయితే, ఇందులోని జీ బ్లాక్ నిర్మాణం అతి పురాతనమైన నిర్మాణంగా పేరు తెచ్చుకుంది.  దీనిని 1888 లో నిజాం నవాబు కాలంలో నిర్మించారు.  మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో సెక్రటేరియట్ నిర్మితమై ఉన్నది.  

ఉమ్మడి ఏపీ పరిపాలనలో మొత్తం 16 మంది ముఖ్యమంత్రులు సచివాలయం నుంచే పరిపాలన సాగించారు.  ఇందులో ఏ బ్లాక్ ను 1981లో అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య ప్రారంభించగా, సి బ్లాక్ ను 1978లో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.  అయితే, ఏ బ్లాక్ లోని ఫేజ్ 2 ను 1998 ఆగుట 10 వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.  ఇకపోతే డి బ్లాక్  ను 2003 వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయగా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దానిని ప్రారంభించారు.  జే,ఎల్ బ్లాకులను 1990 నవంబర్ 12 వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు.  ఈ రెండు బ్లాకులు మొన్నటి వరకు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంగతి తెలిసిందే.