ముంబై.. డూ ఆర్‌ డై

ముంబై.. డూ ఆర్‌ డై

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్ ముంబై ఇండియన్స్‌ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచులాడిన ముంబై.. కేవలం ఒక మ్యాచ్‌లోనే విజయం సాధించింది.  భారీ స్కోర్లు చేస్తే బౌలర్లు విఫలమవడం, తక్కువ టార్గెట్‌ ఉన్నప్పుడు బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేయడం రొటీన్‌గా మారింది. పాయింట్ల పట్టికలో ముంబై ప్రస్తుతం అట్టడుగున ఉంది. అగ్రస్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఈ రోజు ముంబై తలపడబోతోంది. ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌తోపాటు ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సి ఉంటుంది.

ముంబై ఓపెనర్లు ఎవిన్‌, యాదవ్‌ శుభారంభాలు ఇస్తున్నా మిడిలార్డర్‌ చతికిలబడుతోంది. హార్డ్‌ హిట్టర్‌ పొలార్డ్‌తోపాటు పాండ్యా బ్రదర్స్‌ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. బౌలర్ల విషయానికొస్తే అందరూ విఫలమవుతున్నారు. మరోవైపు చెన్నై.. సూపర్‌ ఫామ్‌లో ఉంది. 200 టార్గట్లను సైతం అలవోకగా ఛేదిస్తోంది. ఓపెనర్లు అంబటి రాయుడు, షేన్ వాట్సన్ సూపర్‌ ఫామ్‌లో ఉండడం, మిడిలార్డర్‌లో రైనా రెచ్చిపోతుండడం ఈ జట్టుకి కలిసొచ్చే అంశం.