ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన స్టాలిన్... మూడు నెలల్లోనే...
తమిళనాడులో మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. ఇప్పటికే అధికార పార్టీ అన్నాడీఎంకే ప్రచారాన్ని షురూ చేసింది. ప్రజలకు హామీలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక ప్రతిపక్ష పార్టీ డీఎంకే సైతం ప్రచారాన్ని మొదలుపెట్టింది. సాంప్రదాయ బద్దంగా రెండు జంటలకు వివాహం జరిపించి స్టాలిన్ ప్రచారం మొదలుపెట్టారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, ఎన్నికలు వస్తుండటంతో ముఖ్యమంత్రి పళనిస్వామికి పేదలు గుర్తుకు వచ్చారని అన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని, తాము అధికారంలోకి వచ్చిన నెలలోపే ప్రజాపాలన సాగిస్తారని, ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్టాలిన్ పేర్కొన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)