బ్రేకింగ్ : డీకే అరుణ అరెస్ట్

బ్రేకింగ్ : డీకే అరుణ అరెస్ట్

 వనపర్తి జిల్లా కల్వకుర్తి వద్ద డీకే అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి,  ఏఐ సీసీ కార్యదర్శి సంపత్, మాజీ ఎంపీ మల్లు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. లీసులు అరెస్టు చేసిన సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డి కాలికి స్వల్పంగా గాయాలయ్యాయని తెలుస్తోంది.