దివ్య హత్య కేసు: నిద్రలోనే హత్య.. 13 కత్తి పోట్లు..!

దివ్య హత్య కేసు: నిద్రలోనే హత్య.. 13 కత్తి పోట్లు..!

బెజవాడలో ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య తీవ్ర సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దివ్య, తాను పెళ్లి చేసుకున్నామని.. ఆమె తల్లిదండ్రులే ఒప్పుకోవడం లేదని తెలిపాడు నాగేంద్ర. అయితే, తమ కుమార్తె దివ్య తేజస్వినిని నాగేంద్ర కావాలనే చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందని  జరుగుతున్న ప్రచారం నిజం కాదని, ఆ ఫొటోలు గ్రాఫిక్స్ అని ఆరోపించారు. తమ కూతురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నాగేంద్రను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్‌ చేశారు దివ్య తండ్రి జోసెఫ్... తన కూతురు శరీరంపై ఉన్న 13 కత్తిపోట్లే నాగేంద్ర కిరాతకానికి సాక్ష్యం అన్నారు. ఇంట్లో నిద్రిస్తున్న తమ కూతురిని నిద్రలోనే చంపాడని.. ఆ తర్వాత నాగేంద్ర మాత్రం చిన్నచిన్న గాయాలు చేసుకున్నాడని చెబుతున్నారు.. నాగేంద్రను ఎన్‌కౌంటర్ చేసి చంపేయాలంటున్న జోసెఫ్ ఇంకా ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి...