వాడిని ఎన్ కౌంటర్ చేసి చంపండి.. దివ్య తల్లితండ్రుల డిమాండ్ !

వాడిని ఎన్ కౌంటర్ చేసి చంపండి.. దివ్య తల్లితండ్రుల డిమాండ్ !

విజయవాడలో దివ్య తేజస్విని మృతి ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ఆమె మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.  విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కన్న తన చెల్లెలు నాగేంద్ర కిరాతకానికి బలైపోయిందని దివ్య అన్న దినేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. దివ్య క్యాట్‌కు ప్రిపేరవుతోందని దినేశ్ చెప్పారు. నాగేంద్రతో దివ్యకు పెళ్లి జరిగిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. 

అటు తమ కూతుర్ని అత్యంత కిరాతకంగా హత్య చేసిన నారేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు దివ్య  తండ్రి జోసెఫ్‌. దివ్య శరీరంపై గల 13 కత్తి పోట్లే నాగేంద్ర కిరాతకానికి సాక్ష్యమన్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న తమ కూతుర్ని నిద్రలోనే చంపాడన్నారు. దివ్యను చంపాక... తాను మాత్రం చిన్న గాయాలు చేసుకున్నాడన్నారు. దివ్యను పెళ్లి చేసుకున్నానంటున్న నాగేంద్ర మాటల్లో నిజం లేదన్నారు. పథకం ప్రకారమే దివ్యను హత్య చేసి... మీడియాతో మాట్లాడుతున్నాడని ఆరోపించారు దివ్య తండ్రి జోసెఫ్‌.