స్టార్ హీరోయిన్ ఇంట్లో కరోనా కలకలం...

స్టార్ హీరోయిన్ ఇంట్లో కరోనా కలకలం...

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల, సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్  అనే తేడా లేకుండా అందరూ కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.  ఇక సినిమా రంగంలోనూ పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ అమితాబ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. హీరోయిన్ దిశా పటాని తండ్రి జగదీష్ పటానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్వయంగా వెల్లడించారు. ఉత్తర్ ప్రదేశ్ పవర్ డిపార్ట్మెంట్ లో ఎస్ పి గా ఉన్న ఈయన ఓ కేసు విషయమై లక్నో నుండి బెరేలి వెళ్లారట.ఆ సమయంలో ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తండ్రికి కరోనా పాజిటివ్ రావడంతో దిశా పటాని సహా ఆయన కుటుంబ సభ్యులు అందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దిశా పటాని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది. అయితే లోఫర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ భామ కు మళ్ళీ తెలుగులో సినిమాలు లేకుండాపోయాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే రాణిస్తోంది.