ఏపీలో మరో దిశ ఘటన : తెలంగాణకు చెందిన బాలికపై దారుణం 

ఏపీలో మరో దిశ ఘటన : తెలంగాణకు చెందిన బాలికపై దారుణం 

కర్నూల్ జిల్లాలో మరో దిశ ఘటన రిపీట్ అయింది. కొందరు గుర్తు తెలియని దుండగులు 16 ఏళ్ళ బాలికను అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా.. ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంట్టించారు దుండగులు. అసలు వివరాల్లోకి వెళితే.. గాలేరు-నగరి కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు తల్లి దండ్రులతో బాలిక వచ్చింది. అక్కడున్న కొందరు కామాంధులు ఆ బాలికపై కన్నేశారు. అమ్మాయికి మాయమాటలు చెప్పి ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన బనగాపల్లె మండలం యాగంటిపల్లిలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మృతురాలు తెలంగాణలోని నారాయణపేట జిల్లా మర్రికెల్ల మండలానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. ఇక ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.