ఆర్టీసీ పనితీరుపై సుధీర్ఘ చర్చ

ఆర్టీసీ పనితీరుపై సుధీర్ఘ చర్చ

ఆర్టీసీ పనితీరుపై ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో సుదీర్ఘ చర్చ జరిగింది... కొత్త డిపోలు, గ్రామాలకు బస్సులు, రాజధానికి బస్సు సౌకర్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. 60 స్లీపర్ బస్సులను కొత్తగా కొనుగోలు చేస్తున్నాం... ఈ నెలలోనే వస్తున్నాయని తెలిపారు మంత్రి... రాజధానికి వివిధ ప్రాంతాల నుంచి  స్లీపర్ కోచ్‌ల కోసం ప్రతిపాదనలు ఇస్తే వాటిని నడుపుతామని... నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు 57 శాతం ఉంటే... ఇప్పుడు అది 75 శాతానికి తీసుకొచ్చామన్నారు. 85 శాతం ఆక్యుపెన్సీ తీసుకువస్తే ఆర్టీసీకి నష్టాలు తగ్గుతాయన్న అచ్చెన్నాయుడు... ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ. 200 కోట్లతో పల్లెవెలుగు బస్సులను కొనుగోలు చేస్తున్నామని... అన్ని రూట్లలో పల్లె వెలుగులు తిప్పుతామన్నారు. మాకు లాభాలు అక్కర్లేదు, ప్రజలకు సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసిన మంత్రి... ఎమ్మెల్యేలు కూడా ఆక్యుపెన్సీ పెంచటంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.