కాశ్మీర్ ఫైల్స్ మీద ఫత్వాలు.. తగ్గేది లేదంటున్న మేకర్స్

కాశ్మీర్ ఫైల్స్ మీద ఫత్వాలు.. తగ్గేది లేదంటున్న మేకర్స్

కాశ్మీర్‌ వ్యాలీ చరిత్రలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనున్న మూవీ ‘కాశ్మీర్‌ ఫైల్స్‌’.. ‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వివేక్‌ రంజన్ అగ్నిహోత్రి ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని హిందీలో నిర్మిస్తున్నారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అగర్వాల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆర్టికల్‌ 370 చుట్టూ అల్లిన కథతో ఈ చారిత్రాత్మక సినిమా ఉంటుంది. ఆర్టికల్‌ 370 ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు రద్దు చేశారు? అనే కారణాలను మా సినిమాలో చూపించబోతున్నామని మొదలు పెట్టె సమయంలోనే మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 14, 2020న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా కరోనా కారణంగా ఈ సినిమా షూట్ పూర్తి కాలేదు. అంతా సద్దుమణిగాక షూట్ మొదలు పెట్టి రెండు రోజుల క్రితమే పూర్తి చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకి దర్శకుడికి వ్యతిరేకంగా అక్కడి వారు ఫత్వా జారీ చేశారు. ఈ అంశం మీద నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఫైర్ అయ్యారు. ముందు నుండి ఈ సినిమా ఏ అంశం మీద తీస్తున్నామో చెబుతున్నామని ఇప్పుడు ఇలా ఫత్వాలు జారీ చేయడం సరికాదని అన్నారు. ఎవరెన్ని ఫత్వాలు ఇచ్చినా సినిమాని రిలీజ్ చేయడం ఖాయమని అన్నారు.