'నార‌ప్ప' తరువాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఇదే

'నార‌ప్ప' తరువాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఇదే

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా వ‌చ్చిన అసుర‌న్ సినిమాను తెలుగులో 'నార‌ప్ప' టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల‌. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తుండగా, ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన నారప్ప టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలాఉంటే, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్ర‌ముఖ నిర్మాత‌, ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయనున్నాడట శ్రీకాంత్ అడ్డాల. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారని సమాచారం. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. కాగా, అప్పట్లో కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్షర్ గా శ్రీకాంత్ అడ్డాల పేరొందాడు.