దర్శక దిగ్గజం సింగీతంకు కరోనా పాజిటివ్

దర్శక దిగ్గజం సింగీతంకు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడంలేదు. సామాన్యులు సెలబ్రెటీలు అని తేడాలేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సినీతారలు కూడా కరోనా బారిన పడటం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. బాలీవుడ్ నటులు అమితాబ్ ఫ్యామిలీతో సహా పలువురు కరోనా బారిన పడుతున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ముందుగా మైల్డ్ కరోనా సోకినప్పటికీ ఆ తర్వాత పరిస్థితి తీవ్రంగా విషమించింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు . మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. తాజాగా దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు  కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్నీ అనే స్వయంగా వెల్లడించారు.

"ఇప్పుడేంటి అరవై డెబ్భై సంవత్సరాలుగా పాజిటివ్ నే" అంటూ .. ఆయన చమత్కరించారు. ఇటీవల కొంచెం అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నానని.. పరీక్షల్లో పాజిటివ్ తేలిందని ఆయన తెలిపారు. అప్పటినుంచి హోమ్ ఐసొలేషన్లోనే ఉంటున్నానని, ఈ నెల 23  వరకు కూడా ఐసోలేషన్ లోనే ఉంటానని ఆయన అన్నారు. నన్ను అభిమానించే వాళ్లు , నా సన్నిహితులు ఎవ్వరు కంగారు పడొద్దు . త్వరలోనే కోలుకొని మీముందుకు వస్తాను అని సింగీతం తెలిపారు.నందమూరి బాలకృష్ణ తో సింగీతం శ్రీనివాసరావు తీసిన ఆదిత్య 369 సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.