నా బ్లాక్ బాస్టర్ సినిమాను విజయ్ వదులుకున్నాడు : శంకర్

నా బ్లాక్ బాస్టర్ సినిమాను విజయ్ వదులుకున్నాడు : శంకర్

దర్శకుడు శంకర్ గురించి తెలియని వాళ్ళు ఉండరేమో .. సక్సస్ ఫుల్ సినిమాలు తెరకెక్కించిన శంకర్ గత రెండు సినిమాలు అనుకున్నతగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే శంకర్ దర్శకత్వం వహించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను స్టార్ హీరో విజయ్ వదులుకున్నాడట. యాక్షన్ స్టార్ అర్జున్ నటించిన ఒకేఒక్కడు. సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఒక్క రోజు సీఎం అనే కాన్సెప్ట్ ఇప్పటికీ ఒక సంకలనమే కొన్ని సినిమాల్లో కూడా ఈ కాన్సెప్ట్ ను వాడుకున్నారు. ఈ సినిమాతో అర్జున్ కి వచ్చిన స్టార్డం అంతా ఇంతా కాదు. తెలుగులోనూ ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఏ ఆర్ రెహమాన్ అందించిన  సంగీతం అలరిస్తూనే ఉంది. ఇక ఈ సినిమాకోసం ముందుగా విజయ్ ను సంప్రదించాడట శంకర్. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ సినిమాను వద్దనుకున్నారు. ఆ తర్వాత ఆ కథను శంకర్ అర్జున్ కు వినిపించడం..ఆయనకు బాగా నచ్చడంతో పట్టాలెక్కించారు. ముందుగా ఈ సినిమా స్టోరీని విజయ్ ఫాదర్ కు వినిపించగా ఆయన ఒకే చేశారట. ఆతర్వాత విజయ్ కూడా నచ్చిందట కానీ అప్పటికి విజయ్ వరుస సినిమాలు కమిట్ అవ్వడంతో డేట్స్ అడ్జెస్ట్ కాక విజయ్ ఆ సినిమాను వదులుకున్నాడట. ఆతర్వాత చాలా కలం తర్వాత బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా త్రీఇడియట్స్ సినిమాను విజయ్ తో రీమేక్ చేసాడు శంకర్ . అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం శంకర్ కమలహాసన్ తో భారతీయుడు-2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఒకే ఒక్కడు సీక్వెల్ తీయాలని శంకర్ అనుకుంటున్నారట.