చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు కన్నుమూత...

చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు కన్నుమూత...

టాలీవుడ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది... మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గుడిపాటి రాజ్‌ కుమార్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం రాజ్‌కుమార్ మృతిచెందారు. చిరంజీవితో పాటు.. రాజ్‌కుమార్‌కు కూడా పునాదిరాళ్లు తొలి సినిమా.. మొదటి  సినిమాకే ఏకంగా ఐదు నంది అవార్డులు దక్కాయి. అటు దర్శకుడిగా.. మరోవైపు నిర్మాతగా చిత్రాలను నిర్మించిన రాజ్ కుమార్.. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజ్‌కుమార్‌కు ఈ మధ్యే అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు చిరంజీవి. మరోవైపు, ఈ మధ్య ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్ కుమార్ ఒంటరివాడయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబసభ్యులు. రాజ్ కుమార్ మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.