దినేశ్‌ కార్తీక్‌ రీఎంట్రీ అద్భుతం

దినేశ్‌ కార్తీక్‌ రీఎంట్రీ అద్భుతం
టీమిండియాలో తిరుగులేని ఆటగాడిగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ. ఇండియన్‌ కీపర్లంటే కేవలం వికెట్‌ కీపింగ్‌కే పరిమితమై ఎప్పుడోగానీ సెంచరీలు చేయరు అనే నానుడిని తన హార్డ్‌ హిట్టింగ్‌తో ధోనీ మార్చేశాడు. ఒకానొక దశలో ధోనీకి కూడా గట్టి పోటీనిచ్చాడు దినేశ్‌కార్తీక్‌. కానీ.. ధోనీ ఉన్నంత కాలం జట్టులో సుస్థిర స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. ఇటీవల శ్రీలంక వేదికగా జరిగిన నిదాహాస్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో చివరి బంతికి సిక్స్‌ బాది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన కార్తీక్‌.. ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు. ఈ విధంగా రీఎంట్రీ ఇవ్వడం అద్భుతం అని అంటున్నాడు మాజీ కీపర్ కిరణ్‌మోరె. ధోనీ టెస్టుల నుంచి రిటైర్‌ అయి, వన్డే, టీ20ల్లో ఆడుతున్న తరుణంలో కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా కార్తీక్‌ పునరాగమనం చేయడం భారత జట్టుకు మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు. దినేశ్‌ చాలా మంచి క్రికెటరని, అతడు కెరీర్‌లో ఇంకా సాధించాల్సి చాలా ఉందని కిరణ్‌మోరె అన్నాడు. కార్తీక్‌ గతంలో వికెట్‌ కీపింగ్‌ వదిలేసి బ్యాట్స్‌మన్‌గా ఆడటం తనను అసంతృప్తికి గురిచేసిందని చెప్పాడు. వృద్ధిమాన్‌ సాహా, దినేశ్‌, పార్థివ్‌ పటేల్‌, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌ల రూపంలో మనకు మంచి కీపర్లున్నారని అన్నాడు