సోనూ సూద్ సాయం చేస్తానన్న అనాధలను దత్తత తీసుకున్న దిల్ రాజు

సోనూ సూద్ సాయం చేస్తానన్న అనాధలను దత్తత తీసుకున్న దిల్ రాజు

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకుంటానని ప్రస్తుతం రియల్ హీరోగా మన్ననలు అందుకుంటున్న సోనూసూద్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గరు చిన్నారులు అమ్మానాన్నలను కోల్పోయి అనాథలుగా మారారు. పిల్లల దీనగాధను ఎన్టీవీ సహా పలు ఛానెల్స్ ప్రసారం చేశాయి. దీంతో ఆ పిల్లలకి మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఇప్పటికే కేటీఆర్ లోకల్ నాయకులను ఇంటికి పంపి తక్షణ సాయం అందించగా, ఎంపీ కోమటిరెడ్డి కూడా తక్షణ సాయం అందించి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇక పోలీసులు చిన్నారులకు అండగా నిలిచారు. ఎస్‌ఐ రూ. 5వేలు, పోలీసు సిబ్బంది రూ. 6వేలు అందజేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ఈరోజు చిన్నారులను కలవనున్నారు. ఇక అనాధలుగా మారిన ముగ్గురు పిల్లల వార్త చూసి పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చలించిపోయారు. వెంటనే ఆపిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ సినిమా నిర్మాత దిల్‌రాజుకు ఫోన్‌ చేసి కోరారు. వెంటనే ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్‌రాజు మాటిచ్చారు.