వారి మధ్య తేడా చాలా ఎక్కువ

వారి మధ్య తేడా చాలా ఎక్కువ

ముంబై: భారత క్రికెట్ జట్టు కీలక ఆటగాళ్లు రోహిత్, కోహ్లీల నాయకత్వాలలో చాలా తేడా ఉంటుందని భారత మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అంతేకాకుండా భారత జట్టును టీ20 ఫార్మాట్‌లో ఎవరు నడిపిస్తే మంచిదానిపై తన అభిప్రాయం తెలిపారు. అయితే రోహిత్ ఇటీవల ఐపీఎల్-2020లో ముంబై ఇండియన్స్‌కు సారథ్యం వహించాడు. అంతేకాకుండా రోహిత్ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ వరుసగా ఐదు ఐపీఎల్ టైటిల్లను గెలుచుకుంది. అయితే కోహ్టీ సారథ్యంలో ఆర్‌సీబీ మూడు సార్లు ప్లే ఆఫ్‌కు చేరినా కప్పును తీసుకునే భాగ్యం మాత్రం కోహ్లీ జట్టుకు అందించలేదనన్నాడు. ఆటగాళ్లు ఐపీఎల్‌లో తమ ఆటతీరును బట్టి భారత్ జట్టుకు వెల్లే దారిని తయారుచేసుకోవచ్చని గంభీర్ అన్నాడు. ప్రస్తుతం భారత కెప్టెన్ కోహ్లీ బాగానే చేసినా, రోహిత్ ఆ స్థానానికి పూర్తి న్యాయం చేస్తాడని అతడు చెప్పాడు. ‘విరాట్ చెత్త నాయకుడు కాదు. కానీ ఇక్కడ మనం ఎవరు మంచి నాయకుడని మాట్లాడుతున్నాం. అయితే రోహిత్ గొప్ప నాయకుడు. అందులో సందేహం లేదు. వారి ఇద్దరి మధ్య తేడా చాలా ఎక్కువ’ని గంభీర్ అన్నాడు. ఎప్పుడైనా ఒక ఆటగాడిని భారత జట్టుకు ఎందుకంటే ముందుగా వారి ఐపీఎల్‌ ఆటతీరును పరిగణలోకి తీసుకుంటామనీ, అంతేకాకుండా ఐపీఎల్ జట్ల నాయకులను భారత జట్టుకు ఎందుకు సారథిగా ఎంచుకోమ్మన్నది చెప్తానని గంభీర్ తెలిపాడు. అయితే ‘ఐపీఎల్ ఏమీ గీటురాయి కాదు. కేవలం వారి బ్యాటింగ్, బౌలింగ్‌లను తీరులను అంచనా వేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే కొందరు ఆటగాళ్లను మాత్రం ఐపీఎల్ నుంచి ఎందుకు ఎంచుకునేది గంభీర్ తెలిపాడు. ఐపీఎల్ రాణించిన ఆటగాడు భారత జట్టులో రానించగలుగుతారు, కానీ కెప్టెన్సీ అంటే పూర్తి జట్టు భాద్యతలు వారిపై ఉంటాయి. అందుకనీ ఈ రెండునెలల సీజన్‌ను కెప్టెన్ల విషయంలో పరిగణలోకి తీసుకోరని తన అభిప్రాయాన్ని తెలిపాడు.