శ్రుతి శంతను ప్రేమలో పడిందా?

శ్రుతి శంతను ప్రేమలో పడిందా?

శ్రుతి హాసన్... కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు ప్రేమ అంటూ విదేశాలకు చెక్కేసింది. అయితే విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో విడిపోయిన శ్రుతి మళ్ళీ కెరీర్ పై దృష్టి సారించింది. ఈ జనవరిలో రవితేజ 'క్రాక్'తో హిట్ కూడా కొట్టింది. ప్రస్తుతం అమ్మడి కిట్టీలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే అమ్మడు మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. అతడెవరో కాదు శ్రుతి చిరకాల మిత్రుడు శంతను హాజిరికా. ఇతగాడు ఓ గొప్ప ఆర్టిస్టు. ఆర్ట్ బ్యాక్ డ్రాప్ వృత్తిగా స్వీకరించాడు. శ్రుతిహాసన్ కూడా చక్కటి ఆర్టిస్టు కావడంతో అతగాడి ఆర్ట్ కి పడిపోయింది. స్నేహం చేసింది. ఈ స్నేహాన్ని ప్రేమ అంటూ బాలీవుడ్ మీడియా ఊదరగొడుతోంది. దీనికి శ్రుతి కానీ, శంతను కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. సెల్ఫీలు దిగుతూ ఫోటోషూట్లతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించకుంటే తేడాలొచ్చే అవకాశముంది. మరి వీరిలో ఎవరు ముందుగా స్పందిస్తారో చూడాలి.