మిస్టరీ: టేకాఫ్ అయిన విమానం 35 ఏళ్ల తరువాత ల్యాండయ్యింది... కానీ...
ఈ విశ్వంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి. మేధావులు కొన్ని మిస్టరీలను ఛేదించగా... మరికొన్ని మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. 1954 లో జర్మనీ నుంచి బయలు దేరిన శాంటియాగో 513 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి మిస్ అయ్యింది. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. 1954 సెప్టెంబర్ 4 వ తేదీన మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తరువాత అంటే అక్టోబర్ 12 1989 న బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
35 ఏళ్ళ తరువాత ఎలా ల్యాండ్ అయ్యిందో ఇప్పటి వరకు తెలియలేదు. బ్రెజిల్ లోని పార్టో అలిగ్రే విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ముందు ఆ విమానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదని, ల్యాండింగ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని, ల్యాండింగ్ సమయం క్రాష్ అయ్యినట్టు విమానాశ్రయ సిబ్బంది పేర్కొన్నారు. అందులో 88 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కూడిన విమానం క్యాష్ అయిన తరువాత పరిశీలించగా, అందులో అన్ని అస్థిపంజరాలు ఉన్నాయని విమాన సిబ్బంది చెప్పుకొచ్చారు. అయితే, టేకాఫ్ తరువాత విమానం ఏమైందో... 35 ఏళ్ళు ఎక్కడ తిరిగిందో ఎవరికీ తెలియలేదు. ఇది మిస్టరీ ఇప్పటికి మిస్టరీగా ఉన్నది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)