ఈ సీజన్ లో మాకు అదృష్టం లేదు : ధోని 

ఈ సీజన్ లో మాకు అదృష్టం లేదు : ధోని 

ఈ ఏడాది ఐపీఎల్ లో అత్యంత చెత్త ప్రదర్శన చేసిన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఒకటి. ఇప్పటివరకు ప్రతి ఏడాది ప్లే ఆఫ్ రేస్ లో ఉన్న చెన్నై జట్టు ఈ ఏడాది మాత్రం ముందుగా ప్లే ఆఫ్ రేస్ నుండి తప్పుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ లలో మూడు మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివర్లో ఉంది. ఇక నిన్న ముంబై తో తలపడిన  మ్యాచ్ లో చెన్నై ఘోరంగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో కేవలం 114 పరుగులే చేసి బ్యాటింగ్ లో.... తర్వాత ఒక్క వికెట్ కూడా తీయకుండా బౌలింగ్ లో చేతులెత్తేసింది. 

ఈ  మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ఎక్కడ తప్పు జరిగిందో తెలియడం లేదు. కానీ  ఓటమి పట్ల చాలా బాధగా ఉంది. రాయుడికి గాయం కావడంతో బ్యాటింగ్ భారం మొత్తం మిగితవారి పైన పడింది. ఈ ఏడాది మాది కాదు. అయితే మ్యాచ్ గెలవాలంటే కొంచెం అదృష్టం కూడా ఉండాలి. కానీ ఇప్పుడు మాకు అది లేదు. అందరూ కష్టపడుతున్నారు.. అయిన గెలవలేకపోతున్నాము. మిగిలిన మూడు మ్యాచ్ లలో విజయం సాధిస్తామనే నమ్ముతున్నాను'' అని ధోని చెప్పాడు.