లాక్ డౌన్ నిబంధనలు పాటించిన దొంగ: చేతులకు శుభ్రంగా శానిటైజర్ రాసుకొని చోరీ... 

లాక్ డౌన్ నిబంధనలు పాటించిన దొంగ: చేతులకు శుభ్రంగా శానిటైజర్ రాసుకొని చోరీ... 

దొంగల్లో  చాలా రకాలు ఉంటారు.  కొంతమంది దోచుకున్న సొమ్మును తన అవసరాల కోసం వినియోగించుకుంటే, మరికొంతమంది దొంగలు సినిమాల్లో చూపిన విధంగా లేనివారి కోసం ఉపయోగిస్తుంటారు.  దొంగల్లో ఈ దొంగ మాత్రం చాలా విచిత్రమైన దొంగ.  పరిశుభ్రతను పాటించే దొంగ అన్నమాట.  లాక్ డౌన్ కాలంలో బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్క్ ధరించి, శానిటైజర్ రాసుకోవాలి అనే నిబంధనలు ఉన్నాయి.  

ఆ నిబంధనలు పాటిస్తూ ఓ దొంగ దొంగతనం చేశాడు.  రాజస్తాన్ లోని ధౌల్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కిరాణా షాపుల్లో దొంగతనాలు జరిగిగాయి.  షాపు వెనక భాగం నుంచి కన్నం వేసి లోపలికి వచ్చిన దొంగకు ఆకలేయడంతో చేతులు శుభ్రంగా కడుక్కొని షాపులో ఉన్న కొన్ని ఆహారపదార్ధాలను లాగించేశాడు.  ఆ తరువాత శానిటైజర్ రాసుకొని షాపులో కావాల్సిన వస్తువులను చోరీ చేశారు.  షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.