చెన్నై పై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

చెన్నై పై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

ఐపీఎల్‌లో జోరు కొనసాగిస్తోంది ఢిల్లీ. షార్జా వేదికగా చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించి.. మరో విక్టరీని తన ఖాతాలో వేసుకుంది. పాయింట్ల  పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 58 బంతుల్లో 101 పరుగులు చేసి.. చెన్నైకి చెక్‌ పెట్టడంలో కీలకపాత్ర పోషించాడు శిఖర్‌ ధావన్‌. గబ్బర్‌ రెచ్చిపోవడంతో... చెన్నై నిర్దేశించిన  180 పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది.

డుప్లెసిస్‌ 58, అంబటి రాయుడు 45, జడేజా 33 పరుగులు  చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా రాణించ లేదు. చివర్లో రాయుడు, జడేజా.. స్పీడుగా ఆడటంతో ప్రత్యర్థి ముందు గౌరవప్రదమైన స్కోరును ఉంచగలిగింది చెన్నై. ఈ  మ్యాచ్‌లో మూడు పరుగులకే ఔటై మరోసారి నిరాశపరిచాడు కెప్టెన్‌ ధోనీ. ఈ ఓటమితో చెన్నైకి ప్లే ఆఫ్‌ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దిల్లీ అయిదు వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.