ప్రీ ప్రొడక్షన్ లో 'యుగానికి ఒక్కడు' సీక్వెల్

ప్రీ ప్రొడక్షన్ లో 'యుగానికి ఒక్కడు' సీక్వెల్

కార్తీ నటించిన హిట్ సినిమాల్లో 'యుగానికి ఒక్కడు' ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ పదేళ్ళ క్రితం తీసిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తున్నాడు సెల్వరాఘవన్. అప్పట్లో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా చక్కటి ప్రజాదరణ చూరగొంది. ప్రయోగాత్మక సినిమాగా కూడా పేరు తెచ్చుకుంది. చోళ, పాండ్య రాజుల ఇతివృత్తంతో ఆసక్తికరమైన ట్విస్ట్ లతో తీసిన అడ్వెంచర్ మూవీ ఇది. '7జి బృందావన కాలనీ, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే' తర్వాత సెల్వరాఘవన్ తీసిన చిత్రం కావటంతో అటు తమిళులను, ఇటు తెలుగువారిని కూడా అలరించింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ను ధనుష్‌ తో తీయబోతున్నాడు సెల్వరాఘవన్. కార్తీ కూడా అతిధి పాత్రలో మెరుస్తాడట. సీక్వెల్ ట్రెండ్ బాగా పెరగిన నేపథ్యంలో 'యుగానికి ఒక్కడు' సీక్వెల్ పై కూడా అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సెల్వరాఘవన్ షూటింగ్ కి సన్నాహాలు చేస్తున్నాడు. 2024లో ఈ సినిమాను ఆడియన్స్ ముందు తీసుకురావాలన్నది సెల్వరాఘవన్ ఐడియా.