కోవిన్ సాఫ్ట్ వేర్ ప్రజలకు అందుబాటులో లేదు...   

కోవిన్ సాఫ్ట్ వేర్ ప్రజలకు అందుబాటులో లేదు...   

కోవిన్ సాఫ్ట్ వేర్, కరోనా వ్యాక్సిన్ పంపిణి గురించి తెలంగాణ డిహెచ్ శ్రీనివాస్ ఈరోజు కీలక విషయాలను ప్రకటించారు.  ప్రస్తుతం కోవిన్ సాఫ్ట్ వేర్ ప్రజలకు అందుబాటులో లేదని అన్నారు.  ఎవరైనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోమంటే నమ్మవద్దని అన్నారు.  ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే సాగుతోందని అన్నారు.  రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు వచ్చాయని తెలిపారు.  సాధారణ ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం ఉందని, ఈ వారంలో ప్రభుత్వ హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ పూర్తి కానుందని అన్నారు.  వచ్చేవారం నుంచి ప్రైవేట్ హెల్త్ కేర్ వర్కర్లను టీకా పంపిణి జరుగుతుందని తెలిపారు.  ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన తరువాత 50 ఏళ్ళు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సిన్ అందిస్తామని డిహెచ్ శ్రీనివాస్ పేర్కొన్నారు.