ఆర్సీబీ జట్టుకు షాక్..స్టార్ ప్లేయర్‌కు కరోనా
దేశంలో కరోనా రోజు రోజు విజృంభిస్తోంది. ఇవాళ దాదాపు లక్ష కరోనా కేసులు నమోదవడం అందోళన కలిగించే అంశం. అయితే.. ఈ కరోనా అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ కి కరోనా సెగ తగిలింది. ఇప్పటికే కోల్కత్తా నైట్ రైడర్స్ హిట్టర్ నితీష్ రాణా, ఢిల్లీ ప్లేయర్ అక్సర్ పటేల్, అటు ఓ చెన్నై ప్లేయర్ కి కూడా కరోనా సోకింది. అయితే.. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ టీం ఎమర్జింగ్ ప్లేయర్, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా కరోనా బారీన పడ్డాడు. ఈ సారి బెంగళూరు టీం అతనిపై భారీ ఆశలే పెట్టుకుంది. గతేడాది టోర్నీలోనూ పడిక్కల్ నిలకడగా రాణించాడు. ఈ మధ్యే ముగిసిన విజయ్ హజారే ట్రోపీలో 737 పరుగులతో టోర్నీలో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక టోర్నీ తొలి మ్యాచ్‌కు కేవలం ఐదు రోజు సమయం మాత్రమే ఉన్న ఈ సమయంలో పడిక్కల్ కు కరోనా సోకడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)