శాకుంతలం సినిమాలో దుష్యంతుడు దొరికేశారు..

శాకుంతలం సినిమాలో దుష్యంతుడు దొరికేశారు..

టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత తాజాగా చేయనున్న సినిమా శాకుంతలం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా టీమ్ దుష్యంతుడి పాత్ర కోసం నటుల వేటలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పాత్రకు సరిగ్గా సరిపోయే నటుడు దొరికేశారంట. అతడెవరో కాదండీ మలయాళం నటుడు దేవ్ మోహన్. దుష్యంతుని పాత్రకు దేవ్ మోహన్ ఫిక్స్ అయ్యారంట. ఈ మేరకు ఓ మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీరజ్ గుణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో సమంత ఈ నెల 20 నుంచి చేరనున్నారంట. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.