రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలపై వేటు..

రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలపై వేటు..

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులు లోక్‌సభలో ఆమోదం తర్వాత.. ఆదివారం రోజు రాజ్యసభ ముందుకు వచ్చాయి.. అయితే, ఈ బిల్లులపై ఓటింగ్ సమయంలో రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి... ఇక, ఇవాళ కూడా అదే పరిస్థితి పెద్దల సభలో రిపీట్ అయ్యింది.. ఆదివారం రోజు రాజ్యసభ ఉపాధ్యక్షుడు పట్ల వ్యవసాయ బిల్లులు ఆమోదం సందర్భంగా,  అనుచితంగా వ్యవహరించినందుకు గాను ప్రతిపక్షాలకు చెందిన 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. కాంగ్రెస్, సీపీఐ, ఆప్‌కు చెందిన ఎనిమిది మంది ఎంపీలను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైర్మన్ సీటును చుట్టుముట్టడం, బిల్లులను చించివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.. సభా సాంప్రదాయాలను అంతా పాటించాలని, చైర్మన్ స్థానాన్ని అందరూ గౌరవించాలని వెంకయ్య వ్యాఖ్యానించారు.