టేస్టీ బిజినెస్ లో సత్తా చాటుతోన్న డెలిషియస్ బ్యూటీస్!

టేస్టీ బిజినెస్ లో సత్తా చాటుతోన్న డెలిషియస్ బ్యూటీస్!

బాలీవుడ్ బ్యూటీస్ చాలా మందికి సైడ్ బిజినెస్ లు ఉంటాయి! అయ్యో... ఇందులో ద్వంద్వార్థం ఏం లేదండీ! నటన మాత్రమే కాకుండా మరో వ్యాపారం ఏదో ఒకటి చేసేస్తుంటారు. ముఖ్యంగా, హోటల్స్, రెస్ట్రాంట్స్ మన వాళ్లు బాగా ఇష్టపడుతుంటారు. ఫుడ్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిన డెలిషియస్ బ్యూటీస్ చాలా మందే ఉన్నారు. శ్రీలంక సుందరి జాక్విలిన్ కి కొలొంబో నగరంలో 'కైమా సూత్ర' అనే హోటల్ ఉంది. అలాగే, మన ముంబైలోని బాంద్రాలోనూ 'పాలి థాయ్' అనే రెస్ట్రాంట్ ఉంది. బాంద్రా ఏరియాలోనే శిల్ప శెట్టికి చెందిన 'బాస్టియన్' రెస్ట్రాంట్ కూడా మనం చూడొచ్చు. బాలీవుడ్ సీనియర్ నటుడు, యంగ్ బ్యూటీ అనన్య పాండే తండ్రి చంకీ పాండే. ఈయన ఆధ్వర్యంలో నడిచే 'ద ఇటాలియన్ బిస్ట్రో' కూడా ముంబైలో చాలా ఫేమస్!

కొందరు హీరోయిన్స్ తాము స్వయంగా హోటల్స్ లో పెట్టుబడి పెట్టకున్నా వారి భర్తలకు మోస్ట్ పాప్యులర్ రెస్ట్రాంట్స్ ఉన్నాయి. జుహి చావ్ల భర్త జై మెహతాకి 'లిబాన్', ఆయేషా టకియా హజ్బెండ్ కి 'కోయ్లా' హోటల్స్ ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... దేసీగాళ్ ప్రియాంక విదేసీ హోటల్ నడుపుతోంది. న్యూయార్క్ మహానగరంలో మిసెస్ జోనాస్ 'సోనా' అనే ఫుడ్ సెంటర్ నెలకొల్పింది. అమెరికాలో ఉన్నప్పుడు టేస్టీ ఇండియన్ ఫుడ్ కావాలంటే ప్రియాంకస్ 'సోనా'కి వెళ్లవచ్చు!