కరోనా గురించి భయపడకండి... నాకు తగ్గిపోయింది... 

కరోనా గురించి భయపడకండి... నాకు తగ్గిపోయింది... 

కరోనా అంటే అదేదో పెద్ద మహమ్మారి.  ఒకసారి వస్తే మరణించడం తప్ప మరొక మార్గం లేదు అనే విధంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు.  అయితే, వీటిపై కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి స్పందించారు.  భారత దేశానికి చెందిన 45 సంవత్సరాల వయసు కలిగిన భారతీయ వ్యాపారవేత్త ఇటీవలే వ్యాపారం నిమితం ఫిబ్రవరిలో ఇటలీ వెళ్లి వచ్చాడు.  ఇటలీ నుంచి వచ్చిన మరుసటి రోజున జలుబు జ్వరం వచ్చినట్టుగా తేలింది.  వెంటనే హాస్పిటల్ కు వెళ్లగా, మాములు జ్వరం అని చెప్పి మందులు ఇచ్చారు.  

కానీ, జ్వరం తగ్గకపోవడంతో అతడ్ని వెంటనే ఢిల్లీలోని సఫజర్ జంగ్ హాస్పిటల్ లో చికిత్స పొందారు.  రెండు వారాలపాటు అక్కడ చికిత్స పొందిన తరువాత అతనికి క్యూర్ అయ్యింది.  అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యులను కూడా హాస్పటల్ లో క్వారంటైన్డ్ లో ఉంచినట్టు అయన తెలిపారు.  గవర్నమెంట్ కరోనా ట్రీట్మెంట్ హాస్పటిల్ అంటే మాములుగా ఉంటుంది అనుకుంటే పొరపాటే అని, ప్రతి గది చాలా నీట్ గా ఉంటుందని, ప్రతిరోజూ రెండుసార్లు క్లీన్ చేయడమే కాకుండా అక్కడ ఫెసిలిటీస్, ట్రీట్మెంట్ చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా దిగదుడుపు అని అయన చెప్పుకొచ్చారు.  ఇపుడు తనకు పూర్తిగా క్యూర్ అయ్యిందని చెప్పుకొచ్చాడు.