టాస్‌ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. మార్పులు ఇవే..!

టాస్‌ గెలిచిన ఢిల్లీ.. బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. మార్పులు ఇవే..!

ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య సూపర్ ఫైట్‌ జరుగుతోంది.. అబుదాబి వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించి హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ఢిల్లీ చూస్తుంటే... ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్ని చవిచూసిన సన్‌రైజర్స్‌.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఐపీఎల్ 2020లో బోనీ కొట్టాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌... బౌలింగ్‌ తీసుకున్నారు... ఇషాంత్‌  శర్మ తుది జట్టులో అవకాశం దక్కగా.. ఇక, సన్‌రైజర్స్‌ జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి.. కేన్‌ విలియమ్సన్‌ ఇవాళ మ్యాచ్‌లో ఆడనుండగా.. వృద్ధిమాన్‌ సాహా స్థానంలో అబ్దుల్‌ సమద్‌ తుది జట్టులోకి వచ్చారు. మరి, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ జట్టు ఏం చేస్తుందోనన ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు సన్‌రైజర్స్ ఫ్యాన్స్.