ఢిల్లీలో రేపటి నుంచి ఎప్పటిలా నీటి సరఫరా: రాఘవ్ చడ్డా

ఢిల్లీలో రేపటి నుంచి ఎప్పటిలా నీటి సరఫరా: రాఘవ్ చడ్డా

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సరికానున్న నీటి సరఫరా. ఢిల్లీలో రెపటి నుంచి నీరు అన్ని ప్రదేశాలలో ఎప్పటిలాగా వస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ జల్ బోర్డ్ వైస్ చైర్మన్ రాఘవ్ చడ్డా తెలిపారు. కొన్ని రోజులుగా రాష్ట్ర వాయువ్యభాగంలో, పడమర, ఉత్తర ఢిల్లీ ప్రాంతాలలో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డారని, రేపటి నుంచి ఆ బాధలు ఉండవని రాఘవ్ అన్నారు. అయితే రెండు వాటర్ ప్లాంట్‌ను అధిక నీటితో పోంగుతున్నాయిని, అందుకు వాటికి మరమ్మత్తులు చేయించడంతో కొన్ని ప్రదేశాలు ఇబ్బంది పడ్డాయని తెలిపారు. అంతేకాకుండా యమునా నది హర్యానా నుంచి ఢిల్లీకి వస్తుందని, నీటిలో అమ్మోనియా శాతం అధికంగా ఉండటంతో రెండు నీళ్ల ప్లాంట్‌లను కొన్నాళ్ళు మూసివేయాల్సి వచ్చిందని చెప్పారు. అన్ని ప్రాంతాలకు రేపటి నుంచి నీటికి కొరత ఉండదని చెప్పారు.