ఉత్తర భారతానికి పొంచిఉన్న మరో ముప్పు..!

ఉత్తర భారతానికి పొంచిఉన్న మరో ముప్పు..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ ఉత్తర భారత వాసులకు మరో ముప్పు పొంచివుంది. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాల్లో పంట మొదళ్లను తగలబెట్టడం వల్ల ఏర్పడే కాలుష్యం.. తాజా పరిస్థితులను మరింత దిగజార్చే అవకాశాలున్నాయని వాతావరణ, వ్వవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊపిరి తిత్తులపై ప్రభావం చూపే కరోనా వైరస్‌ బాధితులకు ఇది మరింత ఇబ్బందిగా మారే పరిస్థితి ఉంటుందని సూచిస్తున్నారు. చలి కాలం ప్రారంభ సమయంలో నార్త్‌ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో.. పంట మొదళ్లు తగటబెట్టడం ప్రతి ఏటా ఓ సమస్యగా మారింది. ఈ భీకరమైన పొగతో ఏర్పడే కాలుష్యంతో దేశరాజధాని ఢిల్లీతోపాటు ఉత్తర భారతమంతా కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ముఖ్యంగా గాలి కాలుష్య కారకాలైన పీఎం స్థాయిలతో పాటు కార్బన్‌ మోనాక్సైడ్‌, మీథేన్‌ వంటి విషవాయువుల పెరుగుదలకు  కారణమవుతున్నాయి.