శిఖర్ ధావన్ అజేయ శతకం ... పంజాబ్ లక్ష్యం 165

శిఖర్ ధావన్ అజేయ శతకం ... పంజాబ్ లక్ష్యం 165

ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది.  నిర్ణిత 20 ఓవర్లలో ఢిల్లీ జట్టు 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.  ఢిల్లీ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీ బాదాడు.  ఓపెనర్ గా క్రీజ్ లోకి వచ్చిన శిఖర్ ధావన్, ఇన్నింగ్ చివరి బంతి వరకు క్రీజ్ లోనే ఉండటం విశేషం.  61 బంతుల్లో శిఖర్ ధావన్ 106 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ చేసేందుకు సహకరించాడు.  పృథ్వి షా, అయ్యర్, పంత్, స్టోనిస్, హిట్మేర్ లు తక్కువ స్కోర్ కి ఔటవ్వడంతో ఢిల్లీ జట్టు 164 పరుగులు చేసి పంజాబ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  పంజాబ్ జట్టు 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందా చూడాలి. ఐపీఎల్ లో రెండు వరస మ్యాచ్ లలో రెండు సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా శిఖర్ ధావన్ సరికొత్త రికార్డ్ సాధించాడు.