కరోనా ఉల్లంఘన... రూ.26 కోట్లు వసూలు... 

కరోనా ఉల్లంఘన... రూ.26 కోట్లు వసూలు... 

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.  కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.  మాస్క్ ను తప్పనిసరి చేసింది.  మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.500 నుంచి రూ.2000 వరకు ఫైన్ వేస్తున్నది.  బహిరంగ ప్రదేశాల్లో ఉమ్ము వేసినా, సోషల్ డిస్టెన్స్ పాటించకపోయినా భారీ జరిమానాలు విధిస్తున్నారు.  జూన్ 15 నుంచి నవంబర్ 19 వరకు ఫైన్ రూపంలో ఢిల్లీలో రూ.26 కోట్లు వసూలు చేశారు.  5,37,167 మంది నిబంధనలను ఉల్లంఘించినట్టు అధికారులు పేర్కొన్నారు.  ఢిల్లీలో రికార్డ్ స్థాయిలో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి.