పగ తీర్చుకోవడానికి కరోనా మందు అని చెప్పి విషం ఇచ్చాడు... చివరకు...!! 

పగ తీర్చుకోవడానికి కరోనా మందు అని చెప్పి విషం ఇచ్చాడు... చివరకు...!! 

కరోనా వచ్చి మనుషులు చచ్చిపోతున్నా, మనుషులు మాత్రం పగ పగ అని పరుగులు తీస్తున్నారు.  కొంతమంది కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని పగ సాధించాలని చూస్తున్నారు.  ఇలాంటి వ్యక్తులు ఢిల్లీలో ఉన్నారు.  ఢిల్లీలో నివసించే ఓ వ్యక్తి భార్య, పోలీస్ హోమ్ గార్డ్ తో సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త పగతో రగిలిపోయాడు.  ఎలాగైనా హోమ్ గార్డ్ కుటుంబంపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు.  

కరోనా వైరస్ ను పావుగా ఉపయోగించుకొని ఆ కుటుంబాన్ని అంతం చేయాలనీ అనుకున్నాడు.  దానికోసం ఇద్దరు మహిళలను ఉపయోగించుకున్నాడు.  ఇద్దరు మహిళలకు ఆరోగ్య కార్యకర్తల్లా వేషాలు వేయించి హోమ్ గార్డ్ ఇంటికి పంపించాడు.  ఇద్దరు మహిళలు వారి ఇంటికి వెళ్లి చిన్న బాటిల్ ఇచ్చి కరోనా మందు అని చెప్పి చెప్పాడు.  నిజంగా కరోనా మందు అనుకోని ఆ ఇంట్లోని వాళ్ళు దాన్ని తీసుకున్నారు.  దీంతో ఆ కుటుంబం అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.  వెంటనే వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లడంతో విషం తీసుకున్నట్టుగా వైద్యులు తెలిపారు.  పోలీసులు రంగప్రవేశం చేసి సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు మహిళలను గుర్తించి ప్రశ్నించగా విషయం చెప్పారు.  వెంటనే దీనికి సూత్రధారిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.