ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం... 

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం... 

ఢిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ఢిల్లీలో సెకండ్ వేవ్ మొదలైందని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పడం విశేషం.  కరోనా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని వదలడం లేదు.  ఇప్పటికే అనేకమంది విఐపీలు కరోనా బారిన పడ్డారు.  ఢిల్లీలో రికవరీ రేటుతో పాటుగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య సైతం పెరిగిపోతున్నది.  ఇక ఇదిలా ఉంటె, ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఈనెల 14 వ తేదీన కరోనా సోకింది.  దీంతో అయన ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.  కరోనాతో పాటుగా ఆయనకు డెంగ్యూ కూడా సోకింది.  దీంతో అయన ఆరోగ్యం మరింత క్షిణించింది.  అప్రమత్తమైన అధికారులు మెరుగైన వైద్యం కోసం డిప్యూటీ ముఖ్యమంత్రి సిసోడియాను మాక్స్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.