ఢిల్లీలో కలకలం: కరోనా పేషేంట్ బర్త్ డే పార్టీ... షాక్ లో స్కూల్ సిబ్బంది...!!

ఢిల్లీలో కలకలం: కరోనా పేషేంట్ బర్త్ డే పార్టీ... షాక్ లో స్కూల్ సిబ్బంది...!!

కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది.  దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన సదరు వ్యక్తికి కరోనా సోకినట్టుగా నిర్ధారణ జరిగిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం అతనికి గాంధీలో చికిత్స అందిస్తున్నారు.  

ఇక ఇటీవలే ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకింది.  ఢిల్లీలోని హాస్పిటల్ లో సదరు వ్యక్తి చికిత్స పొందుతున్నాడు.  అయితే, ఈ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చిన తరువాత శుక్రవారం రోజున బర్త్ డే పార్టీ ఇచ్చారు.  ఈ బర్త్ డే పార్టీకి అనేక మంది హాజరయ్యారు.  కొడుకు చదువుకునే స్కూల్ పిల్లలు కూడా హాజరయ్యారు.  అదే వ్యక్తికీ ఇప్పుడు కరోనా పాజిటివ్ గా ఉన్నట్టు తేలడంతో అతనితో పాటుగా అతని కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా ఐసోలేటెడ్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  

ఇక్కడ విషయం ఏమిటంటే, కరోనా సోకిన వ్యక్తి పిల్లలు చదువుకునే స్కూల్ కు సెలవులు ప్రకటించారు.  స్కూల్ టీచర్, పిల్లలతో సన్నిహితంగా ఉండే వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.  స్కూల్ లో జరగాల్సిన పరీక్షలను కూడా స్కూల్ వాయిదా వేసింది.  అయితే, కరోనా సోకిన వ్యక్తి ఇటలీ నుంచి డైరెక్ట్ గా రాకుండా ఆస్ట్రియా మీదుగా రావడంతో ఆతనికి ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ చేయలేదు.