భయపడొద్దు...ఎలాంటి దుష్ప్రభావాలు లేవు... 

భయపడొద్దు...ఎలాంటి దుష్ప్రభావాలు లేవు... 

కరోనా వైరస్ కు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభించారు.  దేశరాజధాని ఢిల్లీలో మొత్తం 81 సెంటర్లలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది.  లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పర్యవేక్షించారు.  మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్ ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు.  వ్యాక్సిన్ వలన ఎలాంటి దుష్ప్రభావం ఉండదని, వ్యాక్సిన్ విషయంలో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.  రాష్ట్రంలో కరోనా వైరస్ ఉదృతి క్రమంగా తగ్గుతోందని, ఇప్పుడు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడం శుభపరిణామం అని కేజ్రీవాల్ తెలిపారు.