ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్...

ఐపీఎల్ 2020 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రేయాస్...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు కోల్‌కత నైట్ రైడర్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే గత మ్యాచ్ లో పంజాబ్ చేతిలో ఓడిన ఢిల్లీ ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్ లో బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తుంది. ఇక బెంగుళూర్ చేతిలో ఘోర పరాజయాన్ని చూసిన కోల్‌కత కు ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. ఎందుకంటే... ఈ మ్యాచ్ లో గెలిస్తేనే కోల్‌కత పాయింట్ల పట్టుకలో 4వ స్థానంలో ఉంటుంది. ఓడిపోతే మాత్రం ఈ రోజు జరిగే రెండో మ్యాచ్ తర్వాత 5వ స్థానానికి పడిపోతుంది. చూడాలి మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

కోల్‌కత : శుబ్మాన్ గిల్, సునీల్ నరైన్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, ఇయాన్ మోర్గాన్ (c), దినేష్ కార్తీక్ (w), పాట్ కమ్మిన్స్, లాకీ ఫెర్గూసన్, కమలేష్ నాగర్‌కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

ఢిల్లీ : శిఖర్ ధావన్, అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్ (c), రిషబ్ పంత్ (w), మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మియర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, తుషార్ దేశ్‌పాండే, అన్రిచ్ నార్ట్జే