ఐపీఎల్ 2020 : బెంగుళూరు పై ఢిల్లీ ఘనవిజయం..

ఐపీఎల్ 2020 : బెంగుళూరు పై ఢిల్లీ ఘనవిజయం..

ఐపీఎల్‌-13 సీజన్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరుపై గెలిచి 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఓడిన బెంగళూరు జట్టు ముందంజ వేయడం ఇతర జట్ల ఫలితాలు, నెట్ రన్‌రేట్‌పై ఆధారపడి ఉంటుంది. 153 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 54, రహానె 60, మెరుపు అర్థశతకాలతో రాణించడంతో ఢిల్లీ మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. బెంగళూరు బౌలర్లలో షాబాద్‌ రెండు వికెట్లు తీయగా మహ్మద్‌ సిరాజ్‌, సుందర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు దేవదత్ పడిక్కల్ 50 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 29, ఏబీ డివిలియర్స్‌ 35 పరుగులతో భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. దీంతో విజయం ఢిల్లీని వరించింది.