ఐపీఎల్ 2021 : టేబుల్ టాపర్ గా ఢిల్లీ...

ఐపీఎల్ 2021 : టేబుల్ టాపర్ గా ఢిల్లీ...

పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు టాప్ ఆర్డర్ లో యువ ఓపెనర్ ప్రభాసిమ్రాన్ సింగ్ (12), గేల్(13) డేవిడ్ మలన్(26) విఫలమైన చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ 58 బంతుల్లో 99 పరుగులు చేయడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. ఇక 167 పరుగుల టార్గెట్ తో వచ్చిన ఢిల్లీకి ఈ మ్యాచ్ లో కూడా ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్ని అందించారు. కానీ షా(39) ఔట్ అయిన తర్వాత స్మిత్(24), పంత్(14) త్వరగా పెవిలియన్ చేరుకున్న ధావన్(69) అర్ధశతకం పూర్తి చేయడంతో ఢిల్లీ 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ఇక ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ చెన్నైని వెన్నకి నెట్టి మొదటి స్థానానికి వెళ్ళింది.