ఐపీఎల్ 2021 : ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ...

ఐపీఎల్ 2021 : ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ...

చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 లో ఈరోజు జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన ఢిల్లీకి ముంబై బౌలర్ జయంత్ యాదవ్ రెండో ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ఆ జట్టు విజయం సాధించిన గత మ్యాచ్ లలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ పృథ్వీ షా(1) పెవిలియన్ చేర్చాడు. కానీ ఫామ్ లో ఉన్న ఢిల్లీ మరో ఓపెనర్ ధావన్(45), ఆసీస్ స్టార్ ఆటగాడు స్మిత్(33) తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు ఔట్ అయ్యే సమయానికి లక్ష్యం చిన్నది కావడంతో తర్వాత వచ్చిన ఢిల్లీ బ్యాట్స్మెన్స్ బంతికో పరుగు చేస్తూ జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఈ ఐపీఎల్ సీజన్ కి మూడో విజయాన్ని ఢిల్లీ తన ఖాతాలో వేసుకోగా రెండో ఓటమిని ముంబై మూటగట్టుకుంది.  

అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టుకి ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. ఓపెనర్ డికాక్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ తో కలిపి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (44) స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. కానీ ఆ తర్వాత ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా వరుస ఓవర్లలో వికెట్లు తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దాంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేసింది.