ఐపీఎల్ 2021 : ఢిల్లీ ఖాతాలో రెండో విజయం...

ఐపీఎల్ 2021 : ఢిల్లీ ఖాతాలో రెండో విజయం...

పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించి ఐపీఎల్ 2021 ల రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీని ఆ జట్టు ఓపెనర్లు మొదటి నుండి విజయం వైపుకే నడిపించారు. కానీ పృథ్వీ షా(32) ఔట్ అయిన తర్వాత కాస్త నెమ్మదించిన ఢిల్లీని మళ్ళీ ధావన్ పైకి లేపాడు. కానీ చివర్లో 92 పరుగుల వ్యతిగత స్కోర్ వద్ద ధావన్ ఔట్ అయిన తర్వాత మ్యాచ్ మళ్ళీ పంజాబ్ వైపుకు వచ్చింది. అయితే 17 ఓవర్ వేసిన షమీ అందులో రెండు నో బాల్స్ తో కలిపి మొత్తం 20 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ వైపుకు వెళ్ళింది. చివరి మూడు ఓవర్లలో 16 కావాల్సి ఉండగా స్టోయినిస్, లలిత్ యాదవ్ కలిసి మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించారు. దాంతో ఈ ఐపీఎల్ లో 6 వికెట్ల తేడాతో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఢిల్లీ.

ఇక అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు ఓపెనర్లు మయాంక్(69), రాహుల్(61) అర్ధశతకాలతో రాణించడంతో  నిర్ణిత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్.